విషాదం: నడి చెరువులో ఫ్రెండ్స్ దావత్..చివరకు ఇలా..

Tragedy: Friends dawat in Nadi pond..two died

0
78

తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు ఐదుగురు స్నేహితులు చెరువులోకి పడవను తీసుకుని వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు అందులో పడి మునిగిపోయారు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్​ మండలంలోని చెరువులోకి ఐదుగురు స్నేహితులు నాటు పడవ తీసుకుని వెళ్లారు. అయితే అందులో పవన్​, నర్సింగ్​ అనే ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయారు. దీనితో మిగతా ముగ్గురు వచ్చి..స్థానికులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానికులు.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పవన్​ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా..నర్సింగ్​ ఆచూకీ లభ్యం కాలేదు. గత ఈతగాళ్ల చేత నర్సింగ్​ కోసం గాలిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో చెరువులోకి మద్యం తాగేందుకు వెళ్లినట్లుగా సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.