Flash: ఏపీలో విషాదం..పెళ్లి జరుగుతున్న సమయంలో కుప్పకూలి వధువు మృతి

0
73

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. విశాఖలోని మధురవాడలో ఓ కుటుంబంలో కూతురు వివాహం అంగరంగవైభవంగా చేస్తున్న క్రమంలో  తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు నిన్న గ్రాండ్ గా రెసప్షన్ జరిపించిన అనంతరం వివాహం చేస్తూ జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన అనే నవవధువు ఒక్కసారిగా కుప్పకూలడంతో బంధువులు అందరు కలిసి హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు.

కానీ ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతూ పెళ్లికుమార్తె ఇవాళ తెల్లవారుజామున మృతి చెందడంతో తల్లితండ్రులు, సన్నిహితులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.  ఈ ఘటనతో వధూవరుల కుటుంబాలలో కోలుకొని విషాదం చోటుచేసుకుంది. కానీ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.