Flash: ఏపీలో విషాదం..చార్జింగ్ పెట్టి ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తుండగా మంటలు..

0
84

కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. దానివల్ల ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ ఫ్రం హోంలో భాగంగా పనిచేస్తుండగా ల్యాప్ టాప్ లు పేలి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు అధికంగా చూస్తున్నాము. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే ఓ యువతీ ప్రాణాల మీదికి వచ్చింది.

కడప జిల్లా బీ కోడూరు మండలం మేకవారిపల్లె కు చెందిన సుమలత బీటెక్ పూర్తి చేసి..బెంగళూరులోని యాజిక్ టెక్ పొల్యూషన్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకుంది. ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఛార్జింగ్ పెట్టిన ల్యాప్ టాప్ వాడుతుండగా ఒక్కసారిగా పేలి ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

ల్యాప్ టాప్ హీట్ అవుతున్నవిషయం గమనించకపోవడంతో ఒక్కసారిగా ల్యాప్ టాప్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో సుమలతకు  తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సుమలతను తల్లితండ్రులు హాస్పిటల్ కు తరలించారు. అంతలోనే ఆమె శరీరంలో 40 శాతం మేర కాలిన గాయాలు ఉన్నాయని, కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు.