ఏపీలో విషాదం..పిడుగుపాటుకు ముగ్గురు బలి

0
140

ఆంధ్రప్రదేశ్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో రామాంజమ్మ , పోతిరెడ్డి పిచ్చిరెడ్డి, ఆలకుంట చిన్న రాములు అనే ముగ్గురు వ్యక్తులు గేదెలను మేపుకోవటానికి పొలాలకు వెళ్లారు.

సాయంత్రం తిరిగివస్తుండగా  ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ పిడుగుపడి అక్కడికక్కడే ముగ్గురూ మృతిచెందారు. దాంతో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఈ వర్షాలు ఎంతమందిని పొట్టనబెట్టుకుంటాయో చూడాలి మరి..!