Flash: ఏపీలో విషాదం..విద్యార్థి ప్రాణాలు బలి తీసుకున్న స్వల్ప వివాదం

0
80

ఏపీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒంటిపూటబడుల కారణంగా విద్యార్థులు మధ్యాన సమయంలో క్రికెట్ ఆడి ఇంటికి వస్తుండగా సూర్య, పండు అనే బాలురు మధ్యలో సైకిల్ విషయంలో చిన్న ఘర్షణ తలెత్తింది. అనంతరం కింద పడిన సైకిల్​ను సూర్య పైకి తీస్తుండగా..పండు బ్యాటుతో సూర్యను బలంగా కొట్టాడు.

కానీ ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పొద్దని బెదిరించడంతో ఆ రాత్రి అలాగే నిద్రించాడు. తెల్లవారుజామున చూస్తే తమ కుమారుడు స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురయ్యి ఆసుపత్రికి తీసుకెళ్తారు. అంతలోనే అతను మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు చేసుకున్నారు.

ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోలివారి కొత్తూరులో చోటు చేసుకుంది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.