బీహార్ లో విషాదం..11 మంది దుర్మరణం..ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

0
121

బీహార్ లో పిడుగులు పెను విషాదాన్ని మిగిల్చాయి. పూర్ణియా, అరారియాలో నలుగురు చొప్పున సుపాల్ లో ముగ్గురు పిడుగుపాటుకు దుర్మరణం చెందారు. పిడుగుపాటు వల్ల సోమవారం ఒక్కరోజే 11 మంది మృత్యువాత పడ్డారు. వీరి మృతిపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ సంతాపం తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.