Flash: హైద‌రాబాద్ లో విషాదం..భవనంపై నుండి దూకి లాయర్ ఆత్మహత్య

0
89

హైదరాబాద్ లోని చందానగర్ లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ కాలనీకి చెందిన లాయ‌ర్ శివానీకి, అతని భర్తకు మధ్య వివాదాలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్న‌ట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరికి పెళ్ళి అయ్యి ఐదు సంవత్సరాలు అవ్వడమే కాకుండా..రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ వివాదాలు తీవ్ర స్థాయికి చేరిన కారణంగా భవనంపై నుండి దూకి రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. దాంతో ఇతని భర్తను అరెస్ట్ చేసి..దర్యాప్తు చేపడుతున్నారు.