మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన నిమ్మన్నగారి లక్ష్మమ్మ(52), లక్ష్మారెడ్డి(55) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలు కారణం ఏంటి? హత్య ఎవరు చేశారు? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.