నేడు హైదరాబాద్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారని ఇద్దరు సూసైడ్ చేసుకున్న ఘటన మరవకముందే తెలంగాణాలో రైలు కిందపడి మరో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..ఘట్కేసర్ రైల్వే స్టేషన్ యంనంపేట ట్రాక్‌పై రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. దాంతో అక్కడ ఉన్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలేంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.