Flash: మేడ్చల్ లో విషాదం..చెరువులో గల్లంతై ముగ్గురు మృతి

0
53

స్నేహితుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా చెరువులో ముగ్గురు గల్లంతై మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..ఉబేద్‌ అనే యువకుడి పుట్టినరోజు వేడుక కోసం చీర్యాల లక్ష్మీనరసింహస్వామి గుడికి 10మంది స్నేహితులు వచ్చారు. కాసేపు సరదాగా ఈత కొడదామని ముగ్గురు విద్యార్థులు చెరువులోకి వెళ్ళి గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు వలల సాయంతో వెతగగా..విద్యార్థుల మృతదేహాలు బయటపడ్డాయి.