ములుగు జిల్లాలో విషాదం..గోదావరిలో ముగ్గురు గల్లంతు

0
133

తెలంగాణ: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో తీవ్ర విషాదం నెలకొంది. పండగ  సందర్బంగా గోదావరిలో గ్రామ దేవతను గంగ స్నానానికి తీసుకెళ్ళారు.  ఈ ఘటనలో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుడు గోదావరిలో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురి కోసం జాలర్లు తీవ్రంగా గాలిస్తున్నారు.