జాతరలో విషాదం..వేడి వేడి సాంబర్ గిన్నెలో పడ్డ వ్యక్తి- Video

0
108

మద్యం మత్తులో ఓ వ్యక్తి వేడి వేడి సాంబర్ గిన్నెలో చనిపోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మద్యం మత్తు..ఊరంతా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తుల కోసం వంటలు చేస్తున్నారు. ఓ వైపు అన్నం మరో వైపు పప్పు పొయ్యి మీద సాంబార్ మరిగిస్తున్నారు. అయితే అప్పుడే అక్కడి ఓ వ్యక్తి బాగా తాగి వచ్చాడు. అతడు నడిచే పరిస్థితిలో కూడా లేడు. అతను అటు ఇటు తూలుతూ మరుగుతున్న సాంబారు గిన్నెలో పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే గమనించి అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించగా..సాంబార్ వేడిగా ఉండడంతో వీలు కాలేదు. చివరకు సాంబార్ గిన్నెను పొయ్యి మీద నుండి కింద పడేయగా సాంబార్ లో ఉన్న వ్యక్తి బయటపడ్డాడు.

కానీ అప్పటికే అతని ఒళ్లు 65% కాలిపోయింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో జాతరలో విషాదం నెలకొంది.

https://www.facebook.com/rajashekar.konda.351/videos/632131194692932