Breaking News- పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం..

0
90

స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు. సంతోషంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. అంతలోనే ఏమైందో తెలియదు. ఎయిర్ గన్‌ మిస్‌ ఫైర్ అయ్యింది. అంతే, అప్పటివరకు స్నేహితుల ముచ్చట్లతో కళకళలాడిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్ గ్రామానికి చెందిన ఫజల్‌.. ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌ నుంచి 8మంది స్నేహితుల్ని పిలిచాడు. రాత్రంతా విందు చేసుకున్నారు. ఆడి పాడుకున్నారు. ఎయిర్‌ గన్‌తో హంగామా చేశారు. అది కాస్తా శృతిమించి గన్‌తో ఫైర్ చేయడంతో అది మిస్ ఫైర్ అయి ముసాఫ్(20) తలకు బలంగా తగిలింది.

తీవ్రంగా గాయపడ్డ యువకుడు ముసాఫ్‌ ఖాన్‌ను వెంటనే సలాక్‌పూర్ నుండి సిద్దిపేటకు ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే ముసాఫ్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.