Flash- మీడియా రంగంలో విషాదం..ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దుర్మరణం

Tragedy in the media field..ABN Andhra Jyoti journalist murdered

0
88

మీడియా రంగంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువ జర్నలిస్ట్ దుర్మరణం పాలయ్యాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా మధు సబ్-ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఆయన బైక్ ను ఓ ట్రక్ ఢీకొంది. అత్యంత వేగంగా వచ్చిన ఆ ట్రక్ బైక్ ను డీకొట్టిన తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో మధుసూదన్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మధు మృతి పట్ల జర్నలిస్టులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.