తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి తూర్పు చర్చి వద్ద అండర్‌బ్రిడ్జిలో ఓ తుఫాను వాహనం నీటిలో మునిగింది. ఆ వాహనంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు కాపాడారు. అయితే వాహనంలోంచి బయటికి రాలేకపోయిన నవ వధువు మాత్రం మృతి చెందింది. దీనితో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కాగా వీరు రాయచూర్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కర్ణాటక భక్తులుగా గుర్తించినట్లు సమాచారం. అలాగే మరి చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Flash- తిరుపతిలో విషాదం..నవవధువు మృతి
Tragedy in Tirupati..New bride dies`