యూపీలో విషాదం..ట్రాక్టర్ బోల్తా..రైతుల దుర్మరణం

0
99

యూపీలోని హర్దోయీ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బేగ్​రాజ్​పుర్ గ్రామానికి చెందిన రైతులు.. నిజాంపుర్​ పులియా మండీలో దోసకాయలు అమ్మి తమ గ్రామానికి ట్రాక్టర్ లో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఓ బ్రిడ్జ్ పైనుండి​ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది రైతులు దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మందిని సహాయక బృందాలు కాపాడాయి.