ఏపీలో నూతన సంవత్సరం రోజున విషాదం చోటు చేసుకుంది. విశాఖలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న 2 ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎటువంటి ప్రమాదాలు, రాష్ డ్రైవింగ్ జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకూ ఆ రహదారిని మూసివేశారు. ఉదయం బీఆర్టీఎస్ రహదారిని తెరిచిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.