విషాదం: ప్రాణం తీసిన సెప్టిక్ ట్యాంక్..ఇద్దరు మృతి

Tragedy: Septic tank killed, two killed

0
82

తెలంగాణ: హైదరాబాద్- కొండాపూర్‌ లో విషాదం చోటు చేసుకొంది. గౌతమి ఎనక్లేవ్ లోని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలని ‘డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్’ అనే ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. దీనితో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం  ఇద్దరు కూలీలు అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేస్తుండగా..ఊపిరాడక ఆ ఇద్దరు మృతి చెందారు. మృతులను సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీ చెందిన వారిగా గుర్తించారు. మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ గ్రామంగా పోలీసులు తెలిపారు.