సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నాయి. కారణాలు ఏవైనా.. వారు చేసిన పనిని చూసి కంటతడి పెట్టించేలా ఉంటుంది.
ఇలాంటి విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రకాంత్, లావణ్య అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో దంపతుల మధ్య కలహాలు వచ్చాయి.
దీనితో నిన్న రాత్రి భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలను తీసుకొని లావణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. భార్య వెళ్లిపోవడంతో భర్త చంద్రకాంత్ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణం తెలిసిన లావణ్య ఇద్దరు పిల్లల్ని చెరువులో పడేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వీరి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.