విషాదం..అన్నదమ్ములను కాటేసిన కరెంట్ తీగలు

0
107

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, వాల్లేపల్లి ఫణీంద్ర అన్నదమ్ములు. నాగేంద్ర బి.టెక్ చదువుతుండగా తమ్ముడు ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి అనారోగ్యంతో వుండడంతో పాలు తేవడానికి పొలానికి వెళ్లారు. కానీ ఇంతలోనే వారిని మృత్యువు వెంబడించింది.

పుంత రహదారిపై 11 కేవీ విద్యుత్ వైరు తెగి ఉండగా..ఇది గమనించని వారు ద్విచక్ర వాహనానికి వైరు తగలడంతో మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధం కాగా..మంటలు అంటుకోవడంతో సంఘటనా స్థలంలోనే అన్నదమ్ములు మరణించారు.

నాగేంద్ర, ఫణీంద్రల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.