తెలంగాణ: రంగారెడ్డి జిల్లా షాదినగర్ పరిధిలోని సోలీపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. తమ బిడ్డలు ఇక లేరనే వార్త తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమితం ఆసుపత్రికి తరలించారు.