విషాదం- సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు మృతి

0
108

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో విషాద ఘటన జరిగింది. ఆరునెలల క్రితం  ఏక్తానగర్‌లో పబ్లిక్ టాయిలెట్ నిర్మించింది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మరుగుదొడ్ల ట్యాంక్ నిండిపోవడం వల్ల దానిని శుభ్రం చేయడానికి ముగ్గురు వ్యక్తులను కాంట్రాక్టర్​ పిలింపిచాడు. శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుధ్య కార్మికులు.. పొరపాటున సెప్టిక్​ ట్యాంకులో పడిపోయారు. దీంతో ఊపిరాడక పోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారు.