విషాదం..ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా

0
126

ఈత సరదా మరో ఇద్దరు విద్యార్థుల ప్రాణలను బలిగొంది. మెదక్‌ జిల్లాలోని మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రాకేష్, అలావత్ కిషన్  ఐటిఐ కాలేజీలో చదువుతున్నారు.

కాగా..ఆదివారం కావడంతో ఇద్దరు విద్యార్థులు కలిసి సరదా కోసం ఈతకు వెళ్లి మృతి చెందారు. దాంతో ఇరు కుటుంబాలలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఇంకా ఈ ఘటన సంబధించి పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.