బర్త్​డే పార్టీకి వెళ్లొస్తుండగా విషాదం..ఐదుగురు దుర్మరణం

0
84

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుకనూర్​ తాలూకా బిన్యాల్ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పడ్​(62) తన కుటుంబంతో కలిసి.. కొప్పల్​లోని తమ బంధువుల ఇంట్లో బర్త్​డే పార్టీకి హాజరయ్యారు. అనంతరం వారు తిరిగి వస్తుండగా..కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోగా..మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తుంది.