విషాద ఘటన..రోడ్డు దాటిస్తానని అంధురాలిపై అత్యాచారం

0
114

మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా తెలంగాణాలో కూడా ఇలాంటి ఘటనే అంధురాలి జీవితాన్ని అంధకారం చేసింది.

మే 25న అంధురాలిని రోడ్డు దాటిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు రాత్రి బస్సు దిగిన అంధురాలిని ఓ వ్యక్తి రోడ్డు దాటిస్తానని చెప్పి ఈ అత్యాచారానికి పాల్పడినట్టు మహిళా పిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.  పోలీసులు తీవ్రంగా గాలించి నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు