ఏపీలో విషాద ఘటన..డబ్బులకు పసికందును అమ్మడానికి సిద్ధపడిన వైద్యుడు

0
89

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైద్యుడు చేసిన పని అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ప్రాణాలు కాపాడవలసిన వైద్యుడే మూడు రోజుల పసికందును డబ్బులకు కకృతిపడి అమ్మడానికి కూడా వెనుకాడని ఘటన విజయవాడలోని కొండూరుజిల్లాలో చోటుచేసుకుంది. వాట్సాప్‌లో రూ.3 లక్షలకు కోసం వైద్యుడు చిన్నారిని అమ్మడానికి సిద్ధపడ్డాడు.

గతకొంతకాలంగా ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్‌గా పనిచేస్తున్న అమృతరావు అనే వ్యక్తి వాట్సాప్‌ గ్రూపులో రూ.3 లక్షలకు చిన్నారిని అమ్ముతున్నట్లు పోస్ట్‌ చేసిన ఘటన అందరిని భయాందోళనకు గురిచేసింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.