ఏపీలో విషాద ఘటన..గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు దుర్మరణం

0
104

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ నలుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలోని  శెట్టూరు మండలం ములకలేడులో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ భారీ పేలుడు దాటికి  ఇంటి పైకప్పు కూలిపోయిన క్రమంలో ఆరుగురు ఉన్నటు సమాచారం తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా..మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబందిని రంగంలోకి దింపి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను వెలికి తీసి..తీవ్రంగా గాయపడిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.