ఏపీలో విషాద ఘటన..పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి

0
99

తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే నవవరుడు శివకుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో చోటు చేసుకుంది.

నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌కు అనే యువకుడికి భాస్కరాపురం గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్ళికి వచ్చిన బంధువులు, స్నేహితులు పెళ్ళిలో ఆనందంగా గడిపి జంటను ఆశీర్వదించారు. అనంతరం ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు శివకుమార్‌.

కానీ ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో వెతుకుతుండగా..బోయరేవుల – మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్‌ పడి ఉండడాన్ని గమనించారు. అనంతరం కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇరుకుటుంబాలలో తీరని విషాదం చోటుచేసుకుంది.