ఏపీలో విషాద ఘటన..పెళ్లైన మూడ్రోజులకే ప్రియుడితో జంప్​

0
124

ప్రస్తుతకాలంలో ప్రేమలో విఫలమై ఆత్మహత్యలు చేసుకోవడంలో పెద్ద ఆశ్యర్యమేమి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతీ చేసిన పనికి తల్లితండ్రులు కన్నీరుమున్నీరు చేసుకుంటున్నారు. పెళ్లయిన మూడు రోజులకే ప్రియుడితో లేచి పోయిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా వారి పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే..మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతీ శివాజీ అనే వ్యక్తిని ప్రేమించగా..ఆమెకు తల్లిదండ్రులు ఈనెల 9వ తేదీ రచ్చమర్రి గ్రామానికి చెందిన యువకుడితో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. కానీ ఆ యువతీకి వివాహం ఇష్టంలేకపోవడంతో పెళ్లయినా మూడో రోజున ఆమె ప్రియుడైన శివాజీతో వెళ్లిపోవడంతో యువతీ బంధువులు, తల్లిదండ్రులు శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు.

ఈ ఘటనలో శివాజీ ఇంట్లో ఉన్న దుస్తులు, బియ్యం కాలిపోవడంతో పోలీసులకు సమాచారం తెలిసి ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో శివాజీ  ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం చేకూరలేదు.  ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.