హైదరాబాద్ లో విషాద ఘటన..ఉరి వేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

0
117

హైదరాబాద్ లోనో గచ్చిబౌలి లో విషాద ఘటన చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ అనే సాఫ్ట్ వెర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడంతో గచ్చిబౌలి లో  విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్లాట్ లో ఇద్దరి రూమ్ మేట్స్ తో కలిసి ఆనందంగా సాఫ్ట్ వెర్ కంపెనీ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది.

అయితే ఈ క్రమంలో ఇద్దరు రూమ్ మేట్స్ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కృతి సంబ్యాల్ స్నేహితుడిని విచారించగా..కృతి సంబ్యాల్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తనకు మెసేజ్ పంపి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపాడు.

మెసేజ్ పంపిన అనంతరం స్నేహితుడు హుటాహుటిగా అక్కడికి వచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా..మార్గం మధ్యలోనే మరణించినట్టు తెలిపుతూ కన్నీరు మున్నీరు పెట్టుకున్నాడు. కానీ ఈ ఘటనకు గల కారణాలు తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.