విషాద ఘటన..పక్షిని కాపాడే క్రమంలో ఇద్దరు మృతి

0
97

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా  మహారాష్ట్ర రాజధాని ముంబైలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పక్షిని కాపాడబోయే క్రమంలో ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటన అందరిని కలచివేస్తుంది. మే 30న 43 ఏళ్ల అమర్ మనీష్ జరీవాలా అనే వ్యక్తి కారులో బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మలాడ్ వెళ్తుండగా..కారు కింద ఒక గ్రద్ద చిక్కుకుంది.

దాంతో ఇద్దరు కారు దిగి గ్రద్దను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో లేన్‌లో వేగంగా వచ్చిన ఒక ట్యాక్సీ ఆ ఇద్దరినీ బలంగా ఢీకొట్టడంతో అందులో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా..మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్థానికులు గాయపడిన పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించాడు.