ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు – చివరకు ఊహించని దారుణం జరిగింది

triangle love story triangle love tragedy delhi love tragedy

0
180

ఈ మధ్య మనం కొన్ని ఘటనలు చూస్తు ఉంటున్నాం, ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారు, ఒకరిని కాదు అంటే మరొకరు చనిపోతున్నారు.. ఇక అమ్మాయిలు కూడా కొందరు ఒకరిని మించి నలుగురిని ఐదుగురిని ట్రాక్ లో పెడుతున్నారు, అయితే చివరకు పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుంటున్నారు,  ఇక్కడ ఇలాంటి లవ్ స్టోరీలో ఓ దారుణం జరిగింది.

దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో తన తండ్రి బర్త్ డే  కేక్ కొనేందుకు 19 ఏళ్ల కునాల్ బయటకు వచ్చాడు, ఈ సమయంలో అతనిపై కొందరు దుండగులు వచ్చి కత్తితో దాడి చేశారు, ఏం జరుగుతుందో తెలిసేలోపు కునాల్ శరీరంలో కత్తిదిగిపోయింది

అక్కడికక్కడే మరణించాడు కునాల్. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా తేలింది..

ఓ యువతి విషయంలో కునాల్- గౌరవ్ మధ్య గొడవ జరుగుతోంది, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో కునాల్ ని అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నాడు గౌరవ్ . హత్య కోసం కత్తులు ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారు అని తేలింది.. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.