Breaking news- తెలంగాణలో కలకలం..టీఆర్ఎస్ నేత దారుణ హత్య

0
99

టీఆర్ఎస్ నేత దారుణ హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో తమ్మిన్ని కృష్ణయ్యను దుండగులు హత్య చేశారు. కత్తులు, కొడవళ్లతో అతి కిరాతకంగా నరికిచంపారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణయ్య.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడు అవుతారు. అయితే టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న కృష్ణయ్య.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.