హైదరాబాద్ లో ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్య

0
99

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాణిగంజ్ డిపో 1 కు చెందిన డ్రైవర్ తిరుపతి రెడ్డి (50) అధికారుల వేధింపులు తట్టుకోలేక మంగళవారం డిపోలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే సహచర కార్మికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే మృతిచెందాడు.

తిరుపతిరెడ్డి రెండు రోజులపాటు విధులకు గైర్హాజరయ్యాడని డిపో అధికారులు ఆయనకు ఈనెల 22వ తేదీ నుంచి బస్సు (డ్యూటీ) ఇవ్వడంలేదు.  మంగళవారం ఉదయం 6.45గంటలకు డిపోకు చేరుకున్న తిరుపతిరెడ్డికి ఇవాళ కూడా డ్యూటీ ఇవ్వలేదు అధికారులు. దీంతో పురుగుల మందు తాగాడు. తిరుపతిరెడ్డి మరణ వార్తను తోటి కార్మికులు కుటుంబసభ్యులకు చేరవేశారు. డిపో వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.