పెళ్లి పీటలపై వధువు కుప్పకూలిన సంఘటనలో ట్విస్ట్

0
93

విశాఖలోని మధురవాడలో ఓ కుటుంబంలో కూతురు వివాహం అంగరంగవైభవంగా చేస్తున్న క్రమంలో  తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు నిన్న గ్రాండ్ గా రెసప్షన్ జరిపించిన అనంతరం వివాహం చేస్తూ జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన అనే నవవధువు ఒక్కసారిగా కుప్పకూలడంతో బంధువులు అందరు కలిసి హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు.

కానీ ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతూ పెళ్లికుమార్తె ఇవాళ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మృతికి గల కారణాన్ని పోలీసులు గుర్తించారు. గన్నేరుపప్పు తిని మృతి చెందినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. నవవధువు బ్యాగులో గన్నేరుపప్పు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.