Smuggling: తల వెంట్రుకల్లో కొకైన్‌ స్మగ్లింగ్‌

-

two culprits caught while Smuggling Cocaine in hair at America: డ్రగ్స్‌ని నియంత్రించటానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్స్‌ కొత్తదారులు వెతుక్కుంటున్నారు. స్మగ్లింగ్‌ చేసేందుకు వీలు ఉన్న ఏ చిన్న దాన్ని వదలిపెట్టడం లేదు. తాజాగా ఇద్దరు మహిళలు కొకైన్‌ స్మగ్లింగ్‌ (Smuggling) చేసేందుకు ఎంచుకున్న దారి చూసి.. కస్టమ్స్‌ అధికారులే ఆశ్చర్యపోయారు. ఇలా కూడా స్మగ్లింగ్‌ చేస్తారా అని నోరెళ్లబెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొలింబియా ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు అప్పుడే విమానం దిగిన ఓ మహిళ ప్రవర్తన, ఆమె జుట్టు చాలా విచిత్రంగా ఉంది.

- Advertisement -

దీంతో ఆమెను ఆపి.. స్కానింగ్‌ చేయగా.. సదరు మహిళ వెంట్రుకల్లో వింత వస్తువులు కనిపించాయి. ఆ వస్తువులను చెక్‌ చేయగా.. అందులో నల్లటి ట్యూబ్‌లో అమర్చిన కొకైన్‌ బయటపడింది. ఇదే విధంగా మరొక మహిళ సైతం పట్టుబడిందని అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలు ప్లాన్‌ ప్రకారం రెండు వేర్వేరు ఎయిర్‌ పోర్టుల ద్వారా వచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు వివరించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, ఇరువురి నుంచి 2 కిలోల ఫౌడర్‌ వైట్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...