దేశంలో ఇప్పటికే చాలామంది బాలురు తెలియక ఈతకు వెళ్లి మరణించిన వారు అధికంగానే ఉన్నారు. తాజాగా సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు గల్లంతవ్వకంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు బాలురు ఆనందంగా సీతారామ ప్రాజెక్టు కాలువలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కనబకుండా పోయిన సంఘటన జూలూరుపాడు మండలం భోజ్యాతండా వద్ద చోటుచేసుకుంది.
అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారించగా గల్లంతైన వారిని నర్సింహరావు, బాబురావు గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి కోసం పోలీసులు పరిసరప్రాంతాల్లో ఉన్న స్థానికుల సహాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు.