ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు చివరకు పెద్దలు పంచాయతీలో ఏం చెప్పారంటే

Two girls fell in love with the same boy

0
90

కొన్ని ఘటనలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇలాంటివి సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలని ప్రేమించాడు ఇద్దరూ కూడా నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని డిమాండ్ చేశారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు అనేది ఓస్టోరీలో చూద్దాం.

సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు సోషల్ మీడియాలో ఇద్దరు అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేశాడు. తర్వాత ఇద్దరూ ఇతన్ని ప్రేమించారు అతను కూడా ఇద్దరిని ప్రేమించాడు. అయితే ఇద్దరూ తమని పెళ్లి చేసుకో అని గ్రామానికి వచ్చి డిమాండ్ చేశారు. చివరకు పంచాయతీకి చేరింది వీరి వ్యవహారం. ఓ అమ్మాయి ఏకంగా అతను లేకపోతే చనిపోతాను అని విషం తాగింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

కోలుకున్న ఆమె తాజాగా మరోమారు గ్రామానికి వచ్చింది. చివరకు ఇద్దరి పేర్లను లాటరీ తీసి ఎవరి పేరు వస్తే వారే అతడిని పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మాయిలు ఇద్దరూ అంగీకరించారు. లాటరీ తీయగా విషం తాగి ఆసుపత్రి పాలైన యువతి పేరు వచ్చింది. చివరకు ఆమెని ఇచ్చి వివాహం చేశారు.