Breaking News- పుల్వామాలో కాల్పుల మోత..ఇద్దరు ముష్కరుల హతం

Two gunmen killed in Pulwama

0
85

జమ్ము కశ్మీర్‌ పుల్వామా మళ్లీ కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతాదళాలు. వారిని గమనించిన టెర్రరిస్టులు ఫైరింగ్‌ జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.