రెండు తలల పాము దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే

Two-headed snake is what experts say about it

0
175

మనం ఒక్కోసారి కొన్ని రకాల జంతువులు చూస్తు ఉంటాం. ఇలాంటి జంతువులు ఉంటాయా అని ఆశ్చర్యపోతాం. ఇక అరుదైన సర్పాలని కూడా చూస్తాం. ఉత్తరాఖండ్లో రెండు తలల కోబ్రా అందరికి దర్శనమిచ్చింది. వికాస్నగర్లోని ఓ కర్మాగారం పరిధిలో ఇది కనిపించింది. ఈ పాము ఎంత పొడవు ఉంది అంటే ఒకటిన్నర అడుగులు ఉంది, దీనిని చాలా అరుదైన పాముగా గుర్తించారు.

ఇలాంటి పాములని చూసి వెంటనే వైద్యులు ఓ మాట చెబుతారు. ఇలాంటి పాములు జన్యుపరమైన లోపంతో పుడతాయని చెబుతున్నారు. 90 శాతం ఇలాంటి సమస్యలతో పుడతాయని తెలియచేశారు. ఈ పాముకి తల ప్రాంతంలోనే రెండు తలలు ఉన్నాయి. ఈ పాము చాలా విషపూరితమైనది. దీనికి రెండు తలల్లో చలనం ఉంటుంది నాలుగు కళ్లు ఉన్నాయి. రెండు నాలుకలు ఉన్నాయి.

అంతేకాదు ఆహారం కోసం ఈ రెండు తలలు వేర్వేరుగా వెతుకులాట మొదలుపెడుతాయని చెబుతున్నారు.
ఈ పాములను అమ్మేందుకు వాటి కోసం స్మగ్లర్లు చూస్తున్నారు. ఈ పాములు పొలాల్లో ఎలుకలను తింటూ పంటలను రక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. కొందరు ఇవి ఇంట్లో వ్యాపారం చేసే చోట ఉంటే కలిసి వస్తుంది అని నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాలు వీటిని నమ్మవద్దు అని చెబుతున్నారు.