ముంబయిలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..పలువురికి గాయాలు

Two killed in Mumbai fire

0
90

ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 2 మరణించారని.. 15 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలు, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.