ఫ్లాష్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ..సహాయక చర్యలు చేపట్టిన మంత్రి

0
90

తెలంగాణలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారి బీబీనగర్ టోల్‌గేట్ మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో డ్రైవర్ తో సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీకొట్టిన ఈ ఘటన జరిగింది. అంతలోనే అటు వైపు వెళ్తున్న  పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులను పిలిపించాడు. అంతేకాకుండా అక్కడే ఉండి సహాయక చర్యలు చేప్పట్టిన అనంతరం పోస్ట్ మట్టం మేరకు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.