Flash: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఇద్దరు మృతి

0
86

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఎలమంచిలి పెట్రోల్ బంక్ సమీపంలో బొలెరో వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు నానీ, సూరిబాబుగా పోలీసులు గుర్తించారు. వీరి స్వస్థలం  గోపాలపట్నం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.