Flash: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కామాంధులు..

0
101

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఘోర దారుణం చోటు చేసుకుంది.

వికారాబాద్​ జిల్లా పూడూరు మండల పరిధిలో ఓ బాలిక రాత్రి సమయంలో అప్పుడే అన్నం తిని బయట నిల్చోవడంతో ఆమెపై కన్నేసిన ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె నోరు మూసి వెనుక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం అది గమనించిన రవి అనే యువకుడు అతడి భారీ నుండి కాపాడినట్టే కాపాడి తన వక్ర బుద్దితో బాధితురాలిపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో బాలిక పరిగెత్తుకుంటూ తమ తల్లిదండ్రుల దగ్గరకు చేరుకొని జరిగిన సంఘటనను తెలియజేయడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్యం పుణ్యం తెలియని ఆబాలికపై కాటేసిన కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.