జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి

0
112

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఎన్ కౌంటర్ లో ఇప్పటికే ఎంతోమంది ఉగ్రవాదులు మరణించగా..తాజాగా జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగి కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లింది. జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఇద్దరు మిలిటెంట్లు మృతిచెందారు. చకత్రాస్‌ ఖండీ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకొన్న పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా..బలగాలు కూడా ఎదురుదాడి చేశాయి. దాంతో అలెర్ట్ అయిన బలగాలు.. ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఘటనలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది సహా ఇద్దరు మరణించినట్టు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. కుప్వారా వద్ద చకత్రాస్‌ ఖండీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా..మరణించిన వారిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన తౌఫిల్‌గా గుర్తించారు.

ఉగ్రవాదుల నుండి ఒక ఏకే రైఫిల్‌, ఐదు మ్యాగ్జైన్లు, పేలుడు పదార్థాలను దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఇటీవల కాలంలో కశ్మీర్‌లో టార్గెట్‌ చేసుకొని అల్పసంఖ్యాక వర్గాల వారిని ఉగ్రవాదులు హత్య చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు గస్తీని తీవ్రతరం చేశాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 28 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అనంతరం పోలీసులు, భద్రతా దళాలు జరిగిన ప్రదేశాన్ని జల్లెడ పట్టి..ఈ ఆపరేషన్‌లో 22 రాష్ట్రీయ రైఫిల్స్‌, 9పారా కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ పాల్గొన్నాయి.