కాల్పుల కలకలం..ఇద్దరు రియల్టర్లు మృతి (వీడియో)

Two realtors killed in Hyderabad shooting (video)

0
132

హైదరాబాద్ లో ఇద్దరు రియల్టర్ల మీద కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇబ్రహింపట్నంలో శ్రీనివాస్ రెడ్డి, రఘురాం రెడ్డి అనే వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి స్పాట్ లోనే మరణించాడు. రఘు ను స్థానికంగా ప్రయివేలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి హత్యకు భూవివాదమే కారణంగా తెలుస్తోంది.

ఇటీవల ఇబ్రహీం పట్నంలో వీరిద్దరూ 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. తాము కొనుగోలు చేసిన భూమి వద్దకు వెళ్లి వస్తుండగా కారుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సదరు భూమిలో మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ కాల్పులకు ముందు మట్టారెడ్డితో వీరిద్దరూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘర్షణ జరగగా కొద్దిసేపటికే కారుపై కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://fb.watch/btAjB4BUOd/