పంజాబ్లో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై సొంత మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు.
హోషియార్పుర్ జిల్లా మహిల్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని ఓ బాలికపై ఆమె మామ జస్బీర్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లి పనికి వెళ్లగా..ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఎనిమిది రోజుల తర్వాత జస్బీర్ సింగ్ మళ్లీ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఎవరికైనా చెబితే.. బాగుండదని బెదిరించాడు. అయితే బాలిక ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె తల్లి వైద్య పరీక్షలు జరిపించగా గర్భం దాల్చినట్లు తేలింది. ఆ తర్వాత తనపై జరిగిన ఘోరం గురించి ఆమె తన తల్లికి తెలియజేసింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.