వ్యాన్ బోల్తా..20 మందికి గాయాలు

0
69

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో పికఫ్ వెహికిల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో
ఇరవై మందికి గాయాలు కాగా..ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సీతంపేట నుండి వజ్జయ గూడ గ్రామంకి ఓ శుభకార్యంకు వెళ్తుండగా..ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా గిరిజనులుగా తెలుస్తుంది.