వరలక్ష్మీ టిఫిన్స్(Varalakshmi Tiffins) పేరు అందరికీ సుపరిచితమే. పోయిన ఏడాది టిఫిన్ సెంటర్ ముసుగులో డ్రగ్స్ దందా చేసినందుకు గానూ రాష్ట్రమంతా వీరి పేరు పెనమోగిపోయింది. వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ అంటే చాలు ఏదీ డ్రగ్స్ సప్లై చేస్తారు అదేనా అని అనడం మొదలు పెట్టారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటకొచ్చిన వరలక్ష్మీ టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ సారి ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి తమపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అనురాధ, మహేశ్వరి అనే ఇద్దరు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు నిన్న.. సెక్షన్స్ 417, 420, 354ఏ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వరలక్ష్మీ టిఫిన్స్(Varalakshmi Tiffins) ఓనర్ ప్రభాకర్ ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.