ఫ్లాష్: వీడు అసలు మనిషేనా..కిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యను హత్య

0
93

దేశంలో దారుణాలు రోజురోజుకు లెక్కలేకుండా పోతున్నాయి. క్షణకాలంలోనే ఎవ్వరనేది కూడా చూసుకోకుండా బలితీసుకోవడానికి వెనుకాడట్లేరు కొందరు కామాంధులు. మొన్నటికి మొన్న..ఉదయాన్నే టీతో పాటు టిఫిన్ పెట్టలేదనే కోపంతో ఓ ముసలాయన కోడలిని తుపాకీతో కాల్చిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఇంకా మరిచిపోకముందే..తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

ఒకతను తన సైకో మెంటాలిటీతో నిండు ప్రాణాన్ని బలితీసుకుంటున్నాడు ఓ దుర్మార్గుడు. మహారాష్ట్ర థానేలోని భయాందర్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న నీలేష్ ఘాగ్ తన భార్య చేసిన కిచిడీలో ఉప్పు ఎక్కువైందని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తరువాత ఏమాత్రం ఆలోచించకుండా క్షణికావేశంలో దాడికి పాల్పడ్డాడు.

ఆ క్రమంలోనే పొడవాటి గుడ్డతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 9 గంటలకు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దుర్మార్గుడైన భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు